sensex: మార్కెట్లకు మరో బ్లాక్ డే.. కుప్పకూలిన సెన్సెక్స్!

  • వరుసగా రెండో రోజు కుప్పకూలిన మార్కెట్లు
  • తీవ్ర ప్రభావం చూపుతున్న రూపాయి విలువ
  • 509 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.73కు పడిపోవడం, అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమైందనే భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 509 పాయింట్లు పతనమై 37,413కు పడిపోయింది. నిఫ్టీ 150 పాయింట్లు నష్టపోయి 11,287కు దిగజారింది. మార్చి 16 తర్వాత ఒక్క రోజులో ఈ స్థాయిలో సెన్సెక్స్ పతనమవడం ఇదే తొలిసారి.  

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రెడింగ్టన్ ఇండియా (5.80%), వరుణ్ బెవరేజెస్ (4.77%), క్వాలిటీ (4.77%), కార్బోరండమ్ యూనివర్సల్ లిమిటెడ్ (3.63%), ఫైజర్ (2.82%).

టాప్ లూజర్స్:
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (-8.20%), మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (-6.82%), స్వాన్ ఎనర్జీ లిమిటెడ్ (-6.81%), ఎన్ఐఐటీ టెక్నాలజీస్ (-6.00%), గేట్ వే డిస్ట్రిపార్క్స్ (-5.73%).

ఇక కోటక్ బ్యాంక్, టీసీఎస్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ, టాటా మోటార్స్, టాటా స్టీల్ షేర్లు 2 నుంచి 3.5 శాతం వరకు నష్టపోయాయి.

More Telugu News