nizam: నిజాం మ్యూజియం చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు!

  • సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు?
  • నిందితులిద్దరూ హైదరాబాద్‌కు చెందిన వారేనని సమాచారం
  • నేడు అధికారికంగా వివరాలు తెలిపే అవకాశం
చారిత్రక నిజాం మ్యూజియంలో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఇద్దరూ ముంబయిలోని ఓ రహస్య ప్రాంతంలో ఉండగా నిన్న అర్ధరాత్రి హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు హైదరాబాద్‌ వాసులేనని సమాచారం. వీరి వద్ద నుంచి చోరీకి గురైన విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మ్యూజియం నుంచి వీరు అత్యంత విలువైన బంగారు టిఫిన్‌ బాక్స్‌, టీ కప్పు, సాసర్‌, బంగారు చెంచాను ఎత్తుకెళ్లారు. కేసుకు సంబంధించి అధికారిక వివరాలు పోలీసులు ఈరోజు వెల్లడించే అవకాశం ఉంది.
nizam
museum
Hyderabad
Hyderabad District
Telangana
mumbai
Maharashtra

More Telugu News