Hyderabad: పంజాగుట్ట వైన్‌షాపులో భారీ అగ్నిప్రమాదం.. లాడ్జీలో చిక్కుకున్న వారిని కాపాడిన పోలీసులు!

  • షార్ట్ సర్క్యూట్‌ కారణంగా మంటలు
  • దుకాణంపైన లాడ్జీ
  • పొగ, మంటలతో ఉక్కిరిబిక్కిరి
పంజాగుట్టలోని ఓ మద్యం దుకాణంలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. మోడల్ హౌస్ సమీపంలో ఉన్న వైన్‌షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దుకాణం పూర్తిగా దగ్ధమైంది. వైన్‌షాప్ పైన భవానీ లాడ్జీ ఉండడంతో లోపల ఉన్నవారు పొగ, మంటలతో ఉక్కిరి బిక్కిరయ్యారు.

సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు క్షణం ఆలస్యం చేయకుండా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అగ్నిమాపక యంత్రాలకు సమాచారం ఇవ్వడంతో సమయానికి అవి కూడా చేరుకున్నాయి. దీంతో ఓ వైపు మంటలను అదుపు చేస్తూనే, మరోవైపు లాడ్జీలో ఉన్నవారిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు స్పందించడం ఏమాత్రం ఆలస్యమైనా ప్రాణనష్టం జరిగి ఉండేదని చెబుతున్నారు. కాగా, అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Panjagutta
wineshop
Police
Lodge

More Telugu News