she teams: ఇక బటన్ నొక్కితే చాలు.. మహిళల భద్రత కోసం ప్రత్యేక బృందాలు ప్రత్యక్షమవుతాయి!

  • మహిళల భద్రతపై దృష్టి సారించిన కేంద్రం
  • రూ.3 వేల కోట్ల నిర్భయ నిధుల విడుదల 
  • సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా 8 నగరాలను ఎంచుకున్న కేంద్రం

కీలక నగరాల్లో మహిళల భద్రతపై కేంద్రం దృష్టి సారించింది. ఈ క్రమంలో ఎనిమిది నగరాల్లో భద్రత పెంపు నిమిత్తం నిధులను కేటాయించింది. సేఫ్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్ల మేర నిర్భయ నిధులను విడుదల చేసింది. దీనిలో భాగంగా హైదరాబాద్‌కు రూ.282.5 కోట్లను మంజూరు చేసింది. సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగుళూరు, చెన్నై, అహ్మదాబాద్, లక్నో నగరాలను ఎంపిక చేసింది. ఈ ఎనిమిది నగరాలకూ రూ.2,919.55 కోట్ల నిధులను మంజూరు చేసింది.

ఈ ప్రాజెక్టులో భాగంగా తరచూ నేరాలు జరిగే ప్రాంతాల్లో క్రైం మ్యాపింగ్ చేసి నిరంతరం పెట్రోలింగ్, షీ టీంలు, మఫ్టీ బృందాలు తిరిగే ఏర్పాటును చేస్తారు. ఈ నిధులతో పానిక్ బటన్స్‌ (ఆపదలో ఉన్న మహిళలు బటన్ నొక్కితే చాలు క్షణాల్లో ప్రత్యేక బృందాలు ప్రత్యక్షమవుతాయి) ఏర్పాటు... ఎల్ఈడీ వీధి దీపాలు, ప్రతి అంగుళం కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు, ప్రతి పోలీస్ స్టేషన్‌లో మహిళా హెల్ప్ డెస్క్‌, మహిళా సంబంధ చార్జిషీట్ల దాఖలు కోసం సైబర్ సెల్, వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్స్ తదితర ఏర్పాట్లను మహిళల భద్రత కోసం చేబడతారు.  

More Telugu News