Gangooly: రవిశాస్త్రి అజ్ఞాని... మేము ఆడింది కూడా దేశం కోసమే: గంగూలీ నిప్పులు

  • ప్రస్తుత భారత క్రికెట్ జట్టే అత్యుత్తమం
  • రవిశాస్త్రి వ్యాఖ్యలపై స్పందించిన గంగూలీ
  • మండిపడ్డ సునీల్ గవాస్కర్
ప్రస్తుతమున్న భారత క్రికెట్ జట్టే అత్యుత్తమమని, గతంలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఎక్కువ విజయాలను మరే జట్టూ సొంతం చేసుకోలేదని కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్రంగా స్పందించాడు. రవిశాస్త్రి అజ్ఞానంతో ఈ వ్యాఖ్యలు చేశాడని ఆరోపించిన ఆయన, అన్ని తరాల క్రికెటర్లూ దేశం కోసమే ఆడారన్న విషయాన్ని ఆయన మరచిపోయినట్టున్నాడని మండిపడ్డాడు.

చేతన్ శర్మ, తను, ధోనీ వంటి వాళ్లం ఎంతో క్రికెట్ ఆడామని, ఇప్పుడు కోహ్లీ కూడా అలా ఆడుతున్నవాడేనని చెప్పిన గంగూలీ, ఒక తరం క్రికెటర్లతో, మరో తరం క్రికెటర్లను పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఈ తరహా వ్యాఖ్యలు రవిశాస్త్రి చేయడం మంచిపద్ధతి కాదని హితవు పలికాడు. కాగా, రవిశాస్త్రి వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సైతం మండిపడ్డ సంగతి తెలిసిందే.
Gangooly
Sunil Gavaskar
India
Cricket

More Telugu News