మళ్లీ పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు!

  • ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డుస్థాయికి చేరుకున్న ధరలు
  • పెట్రోలుపై 12 పైసలు, డీజిల్ పై 10 పైసల ధర పెరుగుదల
  • హైదరాబాద్ లో రూ. 85.35కు చేరుకున్న పెట్రోలు ధర
ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డుస్థాయికి చేరుకున్న 'పెట్రో' ఉత్పత్తుల ధరలు మరింత పైకి ఎగిశాయి. ఈ ఉదయం లీటరు పెట్రోలుపై 12 పైసలు, డీజిల్ పై 10 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. దీంతో హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర రూ. 85.35కు, డీజిల్ ధర రూ. 78.98కి చేరుకుంది.

విజయవాడలో పెట్రోలు ధర రూ. 86.81గా, డీజిల్ రూ. 80.09గా ఉంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 80.50కి పెరుగగా, డీజిల్ ధర రూ. 72.61కి చేరుకుంది. ఇక 'పెట్రో' ఉత్పత్తుల ధరలు అత్యధికంగా ఉండే ముంబైలో పెట్రోలు ధర రూ. 87.89కి, డీజిల్ రూ. 79.09కి చేరుకుంది. కాగా, పెట్రో ధరల పెంపుపై నిరసనగా రేపు భారత్ బంద్ కు విపక్షాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Petrol
Diesel
Hyderabad
OMCs

More Telugu News