Cricket: విదేశీ గడ్డపై టీమిండియా మరో రికార్డు

  • భారత్‌ ఆవల  టెస్ట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఘనత
  • 38 ఏళ్ల నాటి రికార్డును తిరగరాసిన భారత్‌ ఫేసర్లు
  • క్యాచ్‌ల్లో ద్రావిడ్‌ రికార్డు సమం చేసిన రాహుల్‌

సీరిస్‌ పోగొట్టుకుని, ఆఖరి టెస్ట్‌లోనూ తడబాటుతో అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేసిన టీమిండియా 38 ఏళ్ల క్రితం నమోదైన ఓ అరుదైన రికార్డును మాత్రం సొంతం చేసుకుని కాస్త ఊరటనిచ్చింది. ఒక విదేశీ సీరిస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఘనత సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ సీరిస్‌ల్లో ఇప్పటి వరకు భారత్‌ ఫేసర్లు ఇషాంత్‌శర్మ  18, షమీ 14, బుమ్రా 14, హార్డిక్‌పాండ్యా 10,  ఉమేశ్‌యాదవ్‌ మూడు వికెట్లు కలిపి మొత్తం 59 వికెట్లు పడగొట్టి రికార్డు నెకొల్పారు. 1979-80లో పాకిస్థాన్‌ పర్యటనలో కపిల్‌దేవ్‌ (25), కర్సన్‌ ఘావ్రి (15), రోజర్‌బిన్ని (11) సాధించిన 58 వికెట్ల రికార్డును బద్దలుకొట్టారు.

మరోవైపు భారత్‌ ఓపెనర్‌ కె.ఎల్‌.రాహుల్‌ అత్యధిక క్యాచ్‌ల రికార్డును సమం చేసి క్రికెట్‌వాల్‌ రాహుల్‌ ద్రావిడ్‌ సరసన చేరాడు. 2004-05లో ఆస్ట్రేలియాతో జరిగిన సీరిస్‌లో ద్రావిడ్‌ 13 క్యాచ్ లు అందుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్‌ జాక్‌ గ్రెగోరి (15 క్యాచ్‌) పేరున అత్యధిక క్యాచ్‌ రికార్డు ఉంది. ఇంగ్లండ్‌తో భారత్‌ మరో ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉన్నందున రాహుల్‌ ఈ రికార్డును అధిగమిస్తాడని అభిమానులు భావిస్తున్నారు. 

More Telugu News