jagan: వైఎస్ జగన్ ‘బిల్ట్ ఇన్ లీడర్’: జగన్ క్లాస్ మేట్స్

  • జగన్, మేము హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివాం
  • మేమందరం 1991 బ్యాచ్ కు చెందిన వాళ్లం
  • 1 నుంచి 12వ తరగతి వరకు జగనే క్లాస్ కెప్టెన్  

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర కొత్తపాలెం దగ్గర విశాఖపట్నంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా జగన్ చిన్ననాటి మిత్రులు ఆయన్ని కలిశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (1991 బ్యాచ్) కు చెందిన 30 మంది పూర్వ విద్యార్థులు జగన్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులలో ఒకరు మాట్లాడుతూ, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు క్లాస్ కెప్టెన్ గా జగన్ వ్యవహరించారని, ఇది స్కూల్ చరిత్రలోనే రికార్డు అని అన్నారు.

1వ తరగతి నుంచే జగన్ కు నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, ‘బిల్ట్ ఇన్ లీడర్’ అని, తమకు ఎంతో గౌరవంగా ఉందని ఆనందపడ్డారు. జగన్ ని కలిసేందుకు తామందరం హైదరాబాద్ నుంచి విశాఖకు వచ్చామని, ఆయనకు ఎప్పుడూ తమ మద్దతు ఉంటుందని అన్నారు. జగన్ కు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నామని, జగన్ ని సీఎంగా చూడాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.

More Telugu News