Pawan Kalyan: మేనల్లుడి సినిమాలో పవన్ కల్యాణ్?

  • డాలి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా సినిమా 
  • కీలక పాత్రకు పవన్ తో సంప్రదింపులు 
  • పవన్ ఓకే చెప్పేశారంటూ వార్తలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేనానిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టే సమయంలో భిన్న వాదనలు వినిపించాయి. పవన్ అప్పుడప్పుడు సినిమాలు చేస్తారని కొందరంటే... ఆయన పూర్తిగా సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేశారని మరి కొందరు అభిప్రాయపడ్డారు. ఈ రెండింటి మధ్య ఏ విషయం తేలక అభిమానులు కాస్త గందరగోళానికి లోనయ్యారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ వార్త అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. అదేంటంటే, పవన్ మరికొన్ని రోజుల్లో వెండితెరపై కనిపించనున్నారట. 'గోపాల గోపాల', 'కాటమరాయుడు' చిత్రాల దర్శకుడు డాలి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం పవన్‌ను సంప్రదించారట. తన మేనల్లుడి కోసం పవర్ స్టార్ దీనికి ఓకే చెప్పారని ఫిలిం నగర్ వార్త. మరి, ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే!  
Pawan Kalyan
sai dharam tej
dali
vaishnav tej

More Telugu News