bandla ganesh: ముఖానికి గుడ్డ కట్టుకుని కోర్టుకు హాజరైన నిర్మాత బండ్ల గణేష్

  • బండ్ల గణేష్ కు అప్పు ఇచ్చిన ప్రొద్దుటూరుకు చెందిన 68 మంది
  • గణేష్ ఇచ్చిన చెక్కులు బౌన్స్
  • తదుపరి విచారణ అక్టోబర్ 9కి వాయిదా
టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ నిన్న ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు. చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి ఆయన కోర్టు విచారణకు హాజరయ్యారు. కోర్టులోకి వెళ్తున్న సమయంలో ఆయన ముఖానికి గుడ్డ కట్టుకున్నారు.  కేసు వివరాల్లోకి వెళ్తే, ప్రొద్దుటూరుకు చెందిన 68 మంది బండ్ల గణేష్ కు వడ్డీకి డబ్బు ఇచ్చారు. ఆ లావాదేవీలకు సంబంధించి బండ్ల గేణేష్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో, బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఇందులో మూడు కేసులకు సంబంధించి బండ్ల గణేష్ కు కోర్టు సమన్లు జారీ చేసింది. మరోవైపు లోక్ అదాలత్ లో మూడు కేసులకు సంబంధించి రాజీ అయినట్టు తెలుస్తోంది. కేసు విచారణ అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 9కి కోర్టు వాయిదా వేసింది. 
bandla ganesh
check bounce
proddutur
court
tollywood

More Telugu News