నేడు హరికృష్ణ పెద్ద కర్మ.. నెక్లెస్ రోడ్డులోని జలవిహార్‌లో కార్యక్రమం

08-09-2018 Sat 07:41
  • పూర్తయిన ఏర్పాట్లు
  • హాజరుకానున్న రాజకీయ, సినీ ప్రముఖులు
  • గత నెల 29న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హరికృష్ణ
ఇటీవల నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సినీ నటుడు నందమూరి హరికృష్ణ  పెద్ద కర్మను నేడు నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ గ్రాండ్ లాన్స్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు అందరికీ సమాచార పత్రికలు పంపిణీ చేశారు. జలవిహార్‌లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దీనికి హాజరయ్యే అవకాశం ఉంది.

నెల్లూరు జిల్లాలోని ఓ వివాహ వేడుకకు కారులో వెళ్తున్న హరికృష్ణ గత నెల 29న రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. నార్కట్‌ప్లలి సమీపంలో ఆయన కారు డివైడర్‌ను ఢీకొని ఎగిరి అవతల పడింది. తీవ్ర గాయాలపాలైన హరికృష్ణ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.