telangana: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై ఇప్పుడే చెప్పలేం: చీఫ్ ఎలక్షన్ కమిషనర్

  • ముందస్తు ఎన్నికలపై కొసాగుతున్న సందిగ్ధత
  • ఇప్పుడే ఏ విషయం చెప్పలేమన్న రావత్
  • రావత్ తో భేటీ అయిన సురవరం, నారాయణ
తెలంగాణలో ముందస్తు ఎన్నికల అంశంపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. చత్తీస్ గఢ్, మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లతో పాటు తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలను నిర్వహించే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం ఎటూ తేల్చుకోలేకపోతోంది. తెలంగాణకు ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశాలను ఇప్పుడే చెప్పలేమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ తెలిపారు. ఓపీ రావత్ తో సీపీఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, నారాయణలు భేటీ అయ్యారు. నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణకు కూడా ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ ప్రకటించడంపై వీరు అభ్యంతరం వ్యక్యం చేశారు. ఈ సందర్భంగానే రావత్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
telangana
elections
chief election commissioner

More Telugu News