motkupalli: ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా: మోత్కుపల్లి

  • ఆలేరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా
  • 35 ఏళ్లుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా
  • మరోసారి అసెంబ్లీకి పంపితే.. గోదావరి జలాలు సాధిస్తా
తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సంచలన ప్రకటన చేశారు. ఆలేరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. 35 ఏళ్లుగా ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరోసారి ఆలేరు నియోజకవర్గ ప్రజలు తనను దీవించి శానసనభకు పంపాలని కోరారు.

ఎన్నికల్లో తాను గెలుపొందితే ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు గోదావరి జలాలను సాధించి సస్యశ్యామలం చేస్తానని తెలిపారు. ఈ నెల 17న యాదగిరిగుట్టలో ఆలేరు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించబోతున్నానని... ఆ భేటీలో అన్ని విషయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
motkupalli
independent
elections
aleru

More Telugu News