‘హాలీవుడ్ లో ఛాన్స్ ఎందుకు రాలేదు?’ అన్న ప్రశ్నకు స్పందించిన షారుక్ ఖాన్

- మీడియాతో మాట్లాడిన కింగ్ ఖాన్
- హాలీవుడ్ అరంగేట్రంపై ప్రశ్న
- ఫన్నీగా జవాబిచ్చిన షారుక్
ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో..‘మీకు హాలీవుడ్ లో ఆఫర్లు ఎందుకు రావడం లేదు?’ అని ఓ విలేకరి షారుక్ ను ప్రశ్నించాడు. దీనికి షారుక్ జవాబిస్తూ..‘నేను రోజూ చంద్రుడిని చూస్తాను. అలాగని దాని దగ్గరకు వెళ్లలేను కదా. ఓంపురి నుంచి ప్రియాంక వరకూ అందరూ హాలీవుడ్ లో రాణిస్తున్నారు. కానీ నాకు ఒక్క అవకాశం కూడా రావడం లేదు. వాళ్ల స్థాయిని నేను ఎందుకు చేరుకోలేకపోతున్నానో అర్థం కావడం లేదు. బహుశా నేను ఇంగ్లిష్ లో వీక్ కావడంతోనే అవకాశాలు రావడం లేదేమో?’ అని షారుక్ చమత్కరించాడు.