Manchu Manoj: తెలంగాణ అసెంబ్లీ రద్దుపై ట్వీట్ చేసిన మంచు మనోజ్

  • స్వయం పాలన కోసం ఎన్నో త్యాగాలు చేశారు
  • తొలి అసెంబ్లీని రద్దు చేయడం బాధగానే ఉంది
  • జరిగేది మంచికే
తెలంగాణ అసెంబ్లీ రద్దు కావడంపై టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ స్పందించాడు. కేసీఆర్, కేటీఆర్‌లు ప్రజలకు అభివాదం చేస్తున్న ఫొటోలను పోస్టు చేసిన మనోజ్.. స్వయం పాలన కోసం సంవత్సరాలపాటు పోరాడారని, త్యాగాలు చేశారని కొనియాడాడు. అయితే, తొలి అసెంబ్లీని రద్దు చేయడం కొంత బాధగానే ఉన్నా, జరిగినదంతా మంచికే అనిపిస్తోందన్నాడు.

ప్రజలను మరింత బాగా చూసుకునేందుకు మీరు మళ్లీ వస్తారని భావిస్తున్నానని పేర్కొన్నాడు. ఈ మార్పును నమ్మని ప్రతి ఒక్కరికి అది తప్పని నిరూపించారని, మీకు మరింత శక్తి రావాలని కోరుకుంటున్నానని తన ట్వీట్‌లో అభిలషించాడు. కాగా, మనోజ్ ట్వీట్‌పై మిశ్రమ స్పందన లభిస్తోంది. 
Manchu Manoj
KCR
KTR
Telangana
Assembly

More Telugu News