kcr: ప్రతిపక్షాలపై కేసీఆర్ సర్జికల్ స్ట్రయిక్ చేశారు: ప్రొఫెసర్ నాగేశ్వరరావు

  • రెండు అంశాలు ఆశ్చర్యం కలిగించాయి
  • ఒకటి ..105 మంది అభ్యర్థులను ప్రకటించడం
  • రెండోది.. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లివ్వడం

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయడం ద్వారా ప్రతిపక్షాలపై కేసీఆర్ సర్జికల్ స్ట్రయిక్ చేయాలనుకున్నారు, అలాగే చేశారని సీనియర్ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఎందుకు‘సర్జికల్ స్ట్రయిక్’ అని అంటున్నానంటే.. ‘ముందస్తు’ ఎన్నికలొస్తాయని చాలా మందికి తెలుసు. అందరికన్నా ముందు, డిసెంబర్ లోనే ఎన్నికలొస్తాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా రోజుల కిందటే ప్రకటించారు. కానీ, రెండు అంశాలు ఆశ్చర్యం కలిగించాయి. ఒకటి ..105 మంది అభ్యర్థులను ప్రకటించడం, రెండోది.. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ కూడా టికెట్లివ్వడం. 105 మంది అభ్యర్థులను ప్రకటించడమంటే.. ఎదుటి వ్యక్తులు సిద్ధం కాకముందే ఎదురుదాడి చేయడం. దాని వల్ల తమ ప్రత్యర్థి కోలుకోకుండా ప్రయత్నం చేయడం. అందులో, కేసీఆర్ తన వ్యూహరచనను ప్రదర్శించారు. ప్రతిపక్షాలే కాదు టీఆర్ఎస్ లోని నాయకులు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు’ అని చెప్పుకొచ్చారు.

More Telugu News