kcr: రేవంత్ ను ఓడించేందుకు పలు వ్యూహాలు పన్నుతున్న టీఆర్ఎస్!

  • రేవంత్ ను ఓడించేందుకు అనేక వ్యూహాలను పన్నుతున్న టీఆర్ఎస్
  • ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చిన కేసీఆర్
  • రేవంత్ ఓటమి ఖాయమనే ధీమాలో టీఆర్ఎస్
తెలంగాణ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తించే నియోజకవర్గాల్లో కొడంగల్ ఒకటి. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి నియోజకవర్గం ఇది. కేసీఆర్ ను విమర్శించేందుకు సీనియర్ నేతలు కూడా జంకుతున్న సమయంలో సైతం... కేసీఆర్ ను ఢీకొన్న నేత రేవంత్ రెడ్డి.

ఈ నేపథ్యంలో, రేవంత్ ను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో టీఆర్ఎస్ ఉంది. రేవంత్ ను ఎదుర్కొనేందుకు అనేక వ్యూహాలను పన్నుతోంది. రేవంత్ కు పోటీగా ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డిని కేసీఆర్ నిలబెట్టారు. ఇప్పటికే ఈ నియోజకవర్గంపై దృష్టిని సారించిన టీఆర్ఎస్... పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలో, రేవంత్ ఓటమి ఖాయమనే ధీమాతో టీఆర్ఎస్ ఉంది.
kcr
TRS
Revanth Reddy
patnam narender reddy

More Telugu News