Revanth Reddy: ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా!

  • స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖ అందజేత
  • స్పీకర్ ను కలిసేందుకు ప్రయత్నించిన రేవంత్
  • తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన గాడిలో లేదన్న రేవంత్
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్ కార్యాలయంలో తన రాజీనామా లేఖను అందజేశారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ ఉంది. స్పీకర్ ను కలిసేందుకు రేవంత్ ప్రయత్నించారు. కానీ, అందుకు, స్పీకర్ అంగీకరించకపోవడంతో తన లేఖను సంబంధిత కార్యాలయంలో అందజేశారు. కాగా, కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన గాడిలో లేదని, అందుకే, నిరసన వ్యక్తం చేస్తూ తన పదవికి రాజీనామా చేశానని రేవంత్ చెప్పినట్టు సమాచారం.
Revanth Reddy
mla
resigns

More Telugu News