Chandrababu: టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు

  • అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి
  • కొందరు మాత్రమే హాజరైన టీడీపీ ప్రజా ప్రతినిధులు
  • పార్టీకి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ చంద్రబాబు ఫైర్

టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వ్యవహారశైలి ముఖ్యమంత్రి చంద్రబాబుకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వివరాల్లోకి వెళ్తే, అసెంబ్లీ సమావేశాల తొలి రోజున పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ కు నివాళి అర్పించడం ఆనవాయతీగా వస్తోంది. హైదరాబాదులో సమావేశాలు జరిగినప్పుడు ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళి అర్పించేవారు. అసెంబ్లీ అమరావతికి మారాక... వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్నారు. అయితే, ఈ రోజు వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా నివాళి అర్పించాల్సిన బాధ్యతను టీడీపీ ప్రజాప్రతినిధులు విస్మరించారు.

నివాళి అర్పించే కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు, జవహర్, ఎమ్మెల్యేలు యామినీబాల, చాంద్ బాషా, రాధాకృష్ణ, శ్రవణ్ కుమార్, పీలా గోవింద్, గణబాబు, మాధవనాయుడు, ఎమ్మల్సీలు కరణం బలరాం, పోతుల సునీత, గౌరుగాని శ్రీనివాస్, టీడీ జనార్దన్ మాత్రమే హాజరయ్యారు. మిగిలిన వారు హాజరుకాకపోవడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీకి ఇచ్చే గౌరవం ఇది కాదని మండిపడ్డారు. 

More Telugu News