sensex: కోలుకున్న స్టాక్ మార్కెట్లు.. 100 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్

  • ఆరు రోజుల నష్టాలకు బ్రేక్
  • లాభాల్లో కొనసాగుతున్న మార్కెట్లు
  • 124 పాయింట్ల లాభంతో సెన్సెక్స్

గత ఆరు సెషన్లుగా నష్టాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆటోమొబైల్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 10.35 గంటల సమయంలో సెన్సెక్స్ 124 పాయింట్లు పెరిగి 38,142కు చేరుకుంది. నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 11,506 వద్ద కొనసాగుతోంది.

హడ్కో, గ్రాన్యూల్స్ ఇండియా, అరబిందో ఫార్మా, కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, యస్ బ్యాంక్, ఎస్బీఐ, విప్రో తదితర కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, జీ ఎంటర్ టైన్ మెంట్, అదానీ ట్రాన్స్ మిషన్, హిందాల్కో, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ తదితర షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

More Telugu News