comedian: తమిళ సీనియర్ నటుడు, మిమిక్రీ కళాకారుడు రాకెట్ రామనాథన్ కన్నుమూత

  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామనాథన్
  • మిమిక్రీ ఆర్టిస్టుగా విశేష గుర్తింపు
  • ‘కలైమామణి’ అవార్డుతో సత్కరించిన ప్రభుత్వం
ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ హాస్య నటుడు రాకెట్ రామనాథన్ (74) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి 10 గంటలకు తుదిశ్వాస విడిచారు.

స్టేజీ ఆర్టిస్టుగా, మిమిక్రీ కళాకారుడిగా విశేష గుర్తింపు సంపాదించుకున్న రామనాథన్ ఆ తర్వాత చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. శివాజీ గణేశన్, ఎంజీఆర్, రజనీకాంత్, కమల హాసన్ తదితరుల గొంతును అనుకరించడంలో దిట్టగా పేరుగాంచిన రామనాథన్‌ను తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’ బిరుదుతో సత్కరించింది. రామనాథన్ మృతికి తమిళ చిత్రపరిశ్రమ సంతాపం తెలిపింది.
comedian
Tamilnadu
Rocket Ramanathan
Kamal Haasan
Vijayakanth

More Telugu News