maa: 'మా' రచ్చ.. చిరంజీవి ఆగ్రహం.. ఈవెంట్ క్యాన్సిల్ చేసుకున్న మహేష్ బాబు!

  • నిధుల దుర్వినియోగం ఆరోపణలతో రెండుగా చీలిన అసోసియేషన్
  • తన పేరు ప్రస్తావనకు రావడంతో చిరు ఫైర్
  • ఇలాంటి సమయంలో ఈవెంట్ లో పాల్గొనడం మంచిది కాదనే భావనలో మహేష్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు ఈ ఏడాది ఏ మాత్రం అచ్చొచ్చినట్టు లేదు. డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ ఉదంతాలు 'మా' పరువును బజారుకు లాగగా... తాజాగా నిధుల దుర్వినియోగం గొడవ 'మా'ను సిగ్గుతో తలొంచుకునేలా చేసింది. అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా నిధులను దుర్వినియోగం చేశారంటూ ఓ ఆంగ్ల పత్రికలో కథనం ప్రచురితమవడంతో వివాదం తలెత్తింది. సంఘం కార్యదర్శి నరేష్ ఆ కథనానికి మద్దతు పలికారు. దీంతో, అసోసియేషన్ రెండుగా చీలిపోయి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి.

ఈ వివాదంలో తన పేరు ప్రస్తావనకు రావడంతో మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. మరోవైపు అక్టోబర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ ఈవెంట్ ను 'మా' సభ్యులు ఫిక్స్ చేశారు. అయితే, వివాదం నేపథ్యంలో ఈవెంట్ ను మహేష్ బాబు క్యాన్సిల్ చేసుకున్నట్టు ఫిలింనగర్ టాక్. ఇలాంటి సమయంలో తాను ఈ షోలో పాల్గొనడం మంచిది కాదనే భావనలో మహేష్ ఉన్నాడట. యూఎస్ లో ఎంతో ఫాలోయింగ్ ఉన్న మహేష్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకోవడం... 'మా'కు పెద్ద షాకే. 
maa
tollywood
naresh
sivaji raja
Chiranjeevi
Mahesh Babu

More Telugu News