Chandrababu: ‘నేను చెప్పిందే జరగాలి’ అని ఎవరైనా అనుకుంటే పార్టీకి నష్టం!: సీఎం చంద్రబాబు

  • సమర్థవంతమైన నాయకత్వం, సమయం వెచ్చించాలి
  • ఆ పరిస్థితి రాకపోతే కష్టం.. నాకు ఎవరిపైనా కోపం లేదు
  • నా ఫస్ట్ కమిట్ మెంట్ పబ్లిక్
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. రాజధాని అమరావతిలో జరిగిన టీడీపీ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ, ప్రతి నేత సమర్థవంతమైన నాయకత్వాన్ని, సమయాన్ని వెచ్చించే పరిస్థితి రావాలని, ఆ పరిస్థితి రాకపోతే కష్టమని అన్నారు.

'నేను బాగున్నాను.. నేను చెప్పిందే జరగాలి.. నన్నే గౌరవించాలి’ అని ఎవరైనా అనుకుంటే పార్టీకి నష్టం వాటిల్లుతుందని, తనకు ఎవరిపైనా కోపం లేదని, అదే సమయంలో ‘నా ఫస్ట్ కమిట్ మెంట్ పబ్లిక్.. ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయొద్దు, వాళ్ల నమ్మకాన్ని కాపాడుకునేందుకు అనునిత్యం పని చేయాల్సిందిగా కోరుతున్నా..’ అని తమ నేతలకు చంద్రబాబు సూచించారు.
Chandrababu
amaravathi

More Telugu News