vijay devarakonda: విజయ్ దేవరకొండ 'నోటా' నుంచి వదిలిన ట్రైలర్ పైలట్

  • విజయ్ దేవరకొండ హీరోగా 'నోటా'
  • రేపు సాయంత్రం ట్రైలర్ రిలీజ్ 
  • త్వరలోనే సినిమా విడుదల
విజయ్ దేవరకొండను ఒక ఆకతాయిగా .. అల్లరి అబ్బాయిగా తెరపై చూసిన వాళ్లకి, త్వరలో ఆయన 'నోటా' అనే సినిమాలో పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను జ్ఞానవేల్ రాజా నిర్మించాడు. ఈ సినిమా నుంచి రేపు సాయంత్రం 4 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అదే విషయాన్ని స్పష్టం చేస్తూ తాజాగా ఒక పైలట్ వీడియోను వదిలారు.

ది రౌడీ .. ది పొలిటీషియన్ .. ది లీడర్ అంటూ ఎలాంటి డైలాగ్స్ లేకుండా వీడియోను రిలీజ్ చేశారు. విభిన్నమైన షేడ్స్ లో ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కనిపించనున్నాడనే విషయం ఈ పైలట్ ను బట్టి అర్థమవుతోంది. ఈ వీడియో వలన రేపు సాయంత్రం రిలీజ్ కానున్న ట్రైలర్ పై మరింత ఆసక్తి పెరిగింది. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
vijay devarakonda
mehreen

More Telugu News