chaitu: 'శైలజా రెడ్డి అల్లుడు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా నాగ్ - నాని

  • చైతూ హీరోగా 'శైలజా రెడ్డి అల్లుడు'
  • ఈ నెల 9వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ఈ నెల 13వ తేదీన సినిమా విడుదల    

మారుతి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా 'శైలజా రెడ్డి అల్లుడు' చిత్రం రూపొందింది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మారుతి ఈ కథను మలిచాడు. ఈ నెల 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు.ఈ వేడుకకి నాగార్జున .. నాని ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. చైతూ హీరో కనుక నాగ్ ఈ వేడుకకి ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఇక నాగ్ తో కలిసి నాని 'దేవదాస్' చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే నాగ్ తో నానికి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. గతంలో నానికి మారుతి 'భలే భలే మగాడివోయ్'తో సూపర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు కారణాలుగా .. మారుతి ఆహ్వానించగానే నాని ఓకే చెప్పేశాడట.    

  • Loading...

More Telugu News