YSRCP: చంద్రబాబు గారూ, ఇదీ తమరు చేసింది!: చంద్రబాబుపై రోజా ఫైర్

  • మెడికల్ హబ్ చేస్తానన్నారు
  • కనీస సదుపాయాలు కల్పించండి
  • ఫొటోలు ట్వీట్ చేసిన వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ ను మెడికల్ హబ్ చేస్తానన్న సీఎం చంద్రబాబు గిరిజనుల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. రాష్ట్రంలో గిరిజనులు కనీస వైద్య సౌకర్యాలు లేక అల్లాడిపోతున్నారని అన్నారు. ప్రభుత్వానికి గిరిజనుల ఓట్లపై ఉన్న శ్రద్ధ వాళ్ల ప్రాణాలపై లేదన్నారు. విజయనగరం జిల్లాలోని ఓ ఆసుపత్రిలో కనీస సదుపాయాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని రోజా ట్వీట్టర్ లో ప్రస్తావించారు.

విజయనగరంలోని కొత్తవలస గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడుగురు మహిళలకు ఒకే స్టాండ్ సాయంతో సెలైన్లు ఎక్కిస్తున్న, ఒకే బెడ్ పై ఐదుగురు రోగులను కూర్చోబెట్టిన ఫొటోలను ఈ రోజు రోజా ట్వీట్ చేశారు. ‘ఏపీని మెడికల్ హబ్ చేస్తానన్న నారా చంద్రబాబునాయుడు గారూ.. ఇదీ తమరు చేసింది. విజయనగరం జిల్లాలో కొత్తవలస గ్రామ ప్రభుత్వ ఆసుపత్రిలో తీసింది ఈ చిత్రం. ఈ ప్రభుత్వానికి గిరిపుత్రుల ప్రాణాలు అక్కర్లేదు కానీ వాళ్ల ఓట్లు కావాలా?’ అని రోజా ట్విట్టర్ లో ప్రశ్నించారు.
YSRCP
roja
Chandrababu
Andhra Pradesh
Vijayanagaram District
medical hub
tribal

More Telugu News