Court: కోర్టులోనే న్యాయమూర్తిని కాటేసిన పాము!

  • ముంబై, ఓల్డ్ పాన్వేల్ పాత కోర్టులో ఘటన
  • విధి నిర్వహణలో ఉన్న న్యాయమూర్తిని కరిచిన పాము
  • చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసిన వైద్యులు
కోర్టు హాలులో తన ఛాంబరులో ఉన్న ఓ న్యాయమూర్తిని పాము కాటేసిన ఘటన ముంబైలో కలకలం రేపింది. నవీ ముంబైలోని ఓల్డ్ పాన్వేల్, బందర్ రోడ్డులో ఉన్న పాత కోర్టు ఛాంబరులో జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సీపీ కషీద్ కూర్చుని ఉన్న వేళ ఈ ఘటన జరిగింది. తన విధుల నిర్వహణలో ఉన్న కషీద్ కుడి చేతిపై పాము కాటు వేసింది. వెంటనే ఆయన్ను కోర్టు సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స చేసిన వైద్యులు, కోలుకున్నారని తేల్చి నిన్న సాయంత్రం డిశ్చార్జ్ చేశారు. కషీద్ ను కరిచిన పాము విషపూరితం కాదని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనోజ్ భుజ్ బల్ మీడియాకు తెలిపారు. పాత భవంతిలో కోర్టు ఉండటం, చుట్టూ పిచ్చిచెట్లు అధికంగా ఉండటంతోనే సర్పాలు వస్తున్నాయని ఆయన తెలిపారు.
Court
Snake
Bite
Judge
Mumbai

More Telugu News