chennai: చెన్నైలో శాంతియుత ర్యాలీకి సిద్ధమవుతున్న అళగిరి

  • రెండు రోజుల క్రితమే చెన్నై చేరుకున్న అళగిరి
  • ర్యాలీ ఏర్పాట్లలో తలమునకలు
  • భవిష్యత్తు కార్యాచరణ వెల్లడించనున్న బహిష్కృత నేత
ముందుగా వెల్లడించినట్టే ఈ నెల 5న (రేపు) చెన్నైలో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తానని, అదే రోజున తన భవిష్యత్తు కార్యాచరణను వెల్లడిస్తానని డీఎంకే బహిష్కృత నేత అళగిరి తాజాగా చెప్పారు. రెండు రోజుల క్రితమే ఆయన చెన్నై చేరుకున్నారు. తాను కరుణానిధి కుమారుడినని, చెప్పినట్టే ర్యాలీ నిర్వహించి తీరతానని, ఇందులో సుమారు లక్ష మంది పాల్గొంటారని ఆయన అన్నారు. కాగా, ఈ ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లలో అళగిరి తలమునకలై ఉన్నారు.  
chennai
dmk
alagiri

More Telugu News