palle raghunatha reddy: పల్లె రఘునాథరెడ్డిని పరామర్శించిన జేసీ దివాకర్ రెడ్డి

  • పల్లె రఘునాథరెడ్డికి సతీ వియోగం
  • ఇంటికి వెళ్లి ఓదార్చిన జేసీ దివాకర్ రెడ్డి
  • వెంట కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి
భార్య మరణంతో తీవ్ర మనోవేదనలో ఉన్న ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డిని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పరామర్శించారు. అనంతపురం పట్టణంలోని అలమూరు రోడ్డులో ఉన్న పల్లె రఘునాథరెడ్డి ఇంటికి తన కుమారుడు, రాష్ట్ర ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జేసీ పవన్ కుమార్ రెడ్డితో పాటు వెళ్లి ఆయనను ఓదార్చారు. ఈ సందర్భంగా పల్లె ఉమ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. పల్లె కుమారుడు కృష్ణ కిషోర్, కోడలు సింధూరలు ధైర్యంగా ఉండాలని చెప్పారు. 
palle raghunatha reddy
diwakar reddy
condolence

More Telugu News