Chandrababu: ఆ పని చేస్తే.. చంద్రబాబును ఘనంగా సన్మానిస్తాం: ముద్రగడ పద్మనాభం

  • అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా కాపులకు చేసిందేమీ లేదు
  • కాపులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలి
  • హామీలు నెరవేర్చితే.. లక్ష మందితో సన్మానిస్తాం
కాపులను బీసీల్లో చేర్చుతామనే హామీతో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని కాపు నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా... కాపులకు ఒరిగిందేమీ లేదని అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికంటే ముందే కాపులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని అన్నారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చితే... లక్ష మందితో చంద్రబాబుకు ఘన సన్మానం చేస్తామని చెప్పారు.
Chandrababu
mudragada padmanabham
kapu

More Telugu News