Haqqani Network: హక్కానీ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్ మరణించాడు: కీలక ప్రకటన చేసిన ఆఫ్గన్ తాలిబాన్లు

  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జలాలుద్దీన్ హక్కానీ
  • 1980 దశకంలో యూఎస్ సాయంతో రష్యాపై పోరు
  • మరణవార్తను ట్విట్టర్ లో ధ్రువీకరించిన తాలిబాన్లు
ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్ వర్క్ వ్యవస్థాపకుడు, తాలిబాన్ల నేత జలాలుద్దీన్ హక్కానీ మరణించాడు. ఈ విషయాన్ని ఆఫ్గన్ తాలిబాన్లు ఈ ఉదయం ప్రకటించారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, కన్నుమూశారని ఓ ప్రకటన విడుదలైంది. జలాలుద్దీన్ కుమారుడు సిరాజుద్దీన్ హక్కానీ ప్రస్తుతం హక్కానీ నెట్ వర్క్ ను నడిపిస్తున్న సంగతి తెలిసిందే.

జలాలుద్దీన్ మరణవార్తను ట్విట్టర్ లో వెల్లడించిన తాలిబాన్లు, జీహాదీల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని, ఓ గొప్ప నేతను తాము కోల్పోయామని చెప్పారు. 1980 దశకంలో ఆఫ్గనిస్తాన్ ను సోవియట్ యూనియన్ ఆక్రమించుకున్న వేళ, అమెరికా, పాకిస్థాన్ ల సాయంతో జలాలుద్దీన్ రష్యా సైన్యంపై పోరాడాడు. ఆ పోరాటంలో ఆయన చూపిన ధైర్య సాహసాలను అప్పటి యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు చార్లీ విల్సన్ ఎంతో మెచ్చుకున్నారు కూడా. ప్రపంచాన్ని గడగడలాడించిన ఒసామా బిన్ లాడెన్ వంటి ఉగ్రవాదులకు జలాలుద్దీన్ ఆరాధ్యుడు.
Haqqani Network
Jalaluddeen
Sirajudden
Dies

More Telugu News