ntr: 'అరవింద సమేత' కోసం దేవాలయం సెట్ .. సాంగ్ షూటింగ్

  • డిఫరెంట్ లుక్స్ తో ఎన్టీఆర్ 
  • రాయలసీమ యాస ప్రత్యేక ఆకర్షణ 
  • దసరాకి ప్రేక్షకుల ముందుకు  
'అరవింద సమేత వీర రాఘవ' సినిమాను దసరాకి విడుదల చేయనున్నట్టుగా త్రివిక్రమ్ ముందుగానే ప్రకటించారు. అందువలన ఆయన చకచకా షూటింగును కానిచ్చేస్తున్నారు. మరో వైపున డబ్బింగ్ .. రీ రికార్డింగ్ పనులు కూడా కొనసాగేలా చూస్తున్నాడు. కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ఒక దేవాలయం సెట్లో ఫ్యామిలీ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. హీరో ఫ్యామిలీకి సంబంధించిన ఈ పాటలో ముఖ్యపాత్రధారులు పాల్గొంటున్నారు. ఈ పాట .. ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనుండటం .. రాయల సీమ యాస మాట్లాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, కథానాయికగా పూజా హెగ్డే కనిపించనున్న సంగతి తెలిసిందే.  
ntr
pooja hegde

More Telugu News