Sri Chaitanya: తిరుపతి శ్రీ చైతన్య కాలేజిలో రగడ... విద్యార్థులను వార్డెన్లు కొట్టడంతో వీరంగం!

  • మల్లంగుంటలో ఉన్న కాలేజ్
  • సెల్ ఫోన్ వాడుతున్నారని విద్యార్థులను కొట్టిన వార్డెన్లు
  • ఏసీలు, కంప్యూటర్ల ధ్వంసం
చిత్తూరు జిల్లా తిరుపతిలోని మల్లంగుంటలో ఉన్న శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థులు వీరంగం సృష్టించారు. కొందరు విద్యార్థులను వార్డెన్లు కొట్టారని ఆరోపిస్తూ, నిరసనలకు దిగారు. వార్డెన్లు కొట్టడంతో ముగ్గురికి గాయాలు కాగా, విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హాస్టల్ లోని ఏసీలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. కాగా, హాస్టల్ లో సెల్ ఫోన్ వాడకంపై నిషేధం ఉండగా, కొందరు విద్యార్థులు ఫోన్లను వాడుతుండటం వార్డెన్ల దృష్టికి రావడంతో, వారు కొట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
Sri Chaitanya
Tirupati
Vardens
Students

More Telugu News