Chandrababu: త్వరలో ఏపీ మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న సీఎం చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ మంత్రి వర్గ విస్తరణ త్వరలో చేపట్టనున్నట్టు సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు. సచివాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ మృతి కారణంగా మంత్రి వర్గ విస్తరణ కొంచెం ఆలస్యమైందని అన్నారు. సీపీఎస్ విధానం జాతీయ స్థాయిలో తీసుకున్న విధాన నిర్ణయమని, ఈ విధానం అన్ని రాష్ట్రాలలోనూ ఉందని, ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. హైకోర్టు ఏర్పాటు విషయంలో తాము స్పష్టంగా ఉన్నామని,  డిసెంబర్ 15 నాటికి ఈ భవనం పూర్తవుతుందని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Chandrababu

More Telugu News