liquor: ఇది 'మందు'బాబులను దోపిడీ చేయడమే!: ఉండవల్లి

  • భారీ ధరకు అమ్మడంపై మండిపాటు
  • స్ట్రైక్ చేస్తే ప్రభుత్వం అల్లాడిపోతుందని హెచ్చరిక
  • 1.30 లక్షల కోట్ల అప్పును ఏం చేశారని ప్రశ్న

 ప్రభుత్వం మద్యాన్ని ఎక్కువ ధరకు అమ్మడంపై పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో ఈ రోజు జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం రూ.8.50కు తయారయ్యే చీప్ లిక్కర్ ఒక్కో మద్యం బాటిల్ ను ప్రభుత్వం రూ.50కు అమ్ముతోందని మండిపడ్డారు. ఒక్కో బాటిల్ అమ్మినందుకు షాపు వాళ్లకి రూ.3.75 మిగులుతుందని, ఆ విధంగా ఒక్కో బాటిల్ పై ప్రభుత్వం రూ.37.75 లను దోచుకుంటోందని విమర్శించారు.

మందు బాబులు ఓ వారం రోజులు స్ట్రైక్ చేస్తే ప్రభుత్వాలు అల్లాడిపోతాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా కొన్ని బ్రాండ్ల మందు బాటిళ్లను ఉండవల్లి మీడియా సమావేశంలో ప్రదర్శించారు. గత నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం రూ.1.30 లక్షల కోట్ల అప్పు తీసుకుందనీ, ఈ నిధులను ఎక్కడికి మళ్లించారో చెప్పాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై పలువురు తనను సంప్రదిస్తున్నారనీ, ఉద్యోగాలు వదిలేసి రాజకీయాల్లోకి వస్తామని చాలామంది అంటున్నారని వెల్లడించారు.  

  • Loading...

More Telugu News