katti mahesh: ఇకపై నేను ఉండేది విజయవాడలోనే.. ప్రకటించిన కత్తి మహేశ్!

  • ఎయిర్ పోర్ట్ లో మీడియాతో కత్తి
  • తెలంగాణలో తిరగడంపై నిషేధం లేదని వెల్లడి
  • గతంలో హిందూ దేవుళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు
ఇటీవల హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ను పోలీసులు హైదరాబాద్ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా మహేశ్ బెంగళూరులో ఉంటున్నాడు. తాజాగా ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మహేశ్  మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇకపై విజయవాడలోనే ఉండబోతున్నట్లు ప్రకటించాడు.

తనపై హైదరాబాద్ నగరంలోకి వెళ్లకుండా మాత్రమే నిషేధం ఉందనీ, మిగతా తెలంగాణలో స్వేచ్ఛగా పర్యటించవచ్చని వెల్లడించాడు. తనది ఏపీయేనని మహేశ్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తాను విజయవాడకు షిఫ్ట్ అవుతున్నట్లు వెల్లడించాడు.
katti mahesh
Hyderabad
Vijayawada

More Telugu News