Virat Kohli: సౌతాంప్టన్ టెస్టులో ద్రవిడ్ రికార్డును బద్దలుగొట్టిన కోహ్లీ!

  • ఒక సిరీస్‌లో 500 పరుగులు సాధించిన కోహ్లీ
  • 12 ఏళ్ల నాటి ద్రవిడ్ రికార్డు బద్దలు
  • విదేశాల్లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్‌గా ఘనత

టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రికార్డుల జాబితాలోకి మరోటి వచ్చి చేరింది. సౌతాంప్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 58 పరుగులు చేసిన కోహ్లీ పుష్కరకాలం నాటి ద్రవిడ్ రికార్డును బద్దలుగొట్టాడు. ఒకే సిరీస్‌లో 500కు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. విదేశాల్లో జరిగిన టెస్టు సిరీస్‌లలో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్‌గా కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు.

2006లో విండీస్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్‌లో అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ 496 పరుగులు చేశాడు. విదేశాల్లో ఓ ఇండియన్ కెప్టెన్ ఒక సిరీస్‌లో సాధించిన అత్యధిక పరుగుల రికార్డు అదే. ఇప్పుడా రికార్డును కోహ్లీ బద్దలుగొట్టి ఆ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

More Telugu News