Madhavi latha: ప్రేక్షకుల ఓట్లకు విలువ లేదా?: 'బిగ్‌బాస్-2'షోపై నటి మాధవీ లత ఫైర్

  • ఇక కేవలం షో చూసి ఆనందించాలంటున్న నటి
  • నాయుడు ఎలిమినేషన్‌తో అది రుజువైందన్న మాధవీలత
  • ముగింపు దశకు చేరుకుంటున్న బిగ్‌బాస్ షో
నటుడు నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్-2 షోపై నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసింది. నూతన్ నాయుడు ఎలిమినేషన్ అనంతరం ఆమె ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నూతన్ నాయుడు ఎలిమినేషన్‌తో ప్రేక్షకుల ఓట్లకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. అమిత్ కంటే నూతన్‌కు ఎక్కువ ఓట్లు వచ్చినా అతడిని ఎలిమినేట్ చేయడం దారుణమని పేర్కొంది. కేవలం రీ ఎంట్రీ కారణంగానే నూతన్‌ను బయటకు పంపించారని ఆరోపించింది. ఈ ఘటనతో ఇకపై ప్రేక్షకుల ఓట్లకు పెద్దగా విలువ ఉండదని అర్థమైందని తెలిపింది. కేవలం షోను చూసి ఆనందించడానికే పరిమితం కావాలని మాధవీలత సూచించింది.

కాగా, బిగ్‌బాస్‌ హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. సామాన్యుడి కోటాలో హౌస్‌లోకి వచ్చిన గణేశ్ శనివారం ఎలిమినేట్ కాగా, ఆదివారం నూతన్ నాయుడు ఎలిమినేట్ అయ్యాడు. సామాన్యుడి కోటాలో హౌస్‌లో అడుగుపెట్టిన గణేశ్, నూతన్ నాయుడులలో నూతన్ ఓసారి ఎలిమినేట్ అయి, రీ ఎంట్రీ ఇవ్వగా, గణేశ్ సెలబ్రిటీలకు దీటుగా 84 రోజులు హౌస్‌లో ఉండి సత్తా చాటాడు. దీంతో ఇప్పుడు హౌస్‌లో మిగిలింది సెలబ్రిటీలు మాత్రమే.
Madhavi latha
Actress
BigBoss
Nani
Nutan Naiudu
Ganesh

More Telugu News