KCR: ఔటర్ రింగ్ రోడ్డు వద్ద స్తంభించిన ట్రాఫిక్

  • కొంగరకలాన్ వెళ్లే మార్గంలో స్తంభించిన ట్రాఫిక్  
  • పటాన్ చెరు, అప్పా రింగ్ రోడ్డు వద్ద భారీగా వాహనాలు
  • పెద్ద అంబర్ పేట వద్ద ఓఆర్ఆర్ పై నిలిచిన ట్రాఫిక్  
టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు తెలంగాణలోని 31 జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో పటాన్ చెరు, అప్పా రింగ్ రోడ్డు నుంచి కొంగరకలాన్ వెళ్లే మార్గంలో ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం జిల్లాల వైపు నుంచి వచ్చిన వాహనాలతో పెద్ద అంబర్ పేట వద్ద ఓఆర్ఆర్ పై ట్రాఫిక్ నిలిచిపోవడంతో, విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలు బారులు తీరాయి.
KCR
orr

More Telugu News