Chandrababu: నా ఆత్మీయుడు హరికృష్ణ లేడన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా: చంద్రబాబు

  • హరికృష్ణ జయంతి నేడు
  • ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు
  • హరి స్ఫూర్తిని ముందుకు తీసుకెళతామన్న బాబు
తన బావమరిది నందమూరి హరికృష్ణ మరణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన మరణవార్త తెలియగానే అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్న చంద్రబాబు... అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు భౌతికకాయం పక్కనే ఉన్నారు. హరి పాడెను కూడా భుజాన మోసి ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ఈ రోజు హరికృష్ణ జయంతి. ఈ సందర్భంగా చంద్రబాబు మరోసారి తీవ్ర ఆవేదనను వ్యక్తపరిచారు.

 'చైతన్య రథసారథి, నా ఆత్మీయుడు హరికృష్ణ లేరనే చేదు నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఈరోజు తన జయంతి సందర్భంగా ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా...  టీడీపీ కార్యకర్తల్లో ఆయన నింపిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళతామని మాట ఇస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు.
Chandrababu
hari krishna
birthday

More Telugu News