YSRCP: తండ్రి వైఎస్ఆర్ ను తలచుకున్న జగన్!
- నేడు వైఎస్ఆర్ 9వ వర్థంతి
- వైఎస్ ఆశయ సాధనకు నా జీవితం అంకితం
- ట్విట్టర్ లో హామీ ఇచ్చిన వైఎస్ జగన్
నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్, ఆయన విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఆయన ఓ ట్వీట్ పెడుతూ, తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలు మదిలో మెదులుతున్నాయని తెలిపారు.
ఆయన ఆదర్శాలు అందరికీ మార్గదర్శకాలని, ఆయన ఆశయ సాధనకు తన జీవితాన్ని అంకితం చేస్తానని హామీ ఇస్తున్నట్టు చెప్పారు. కాగా, కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ స్మారకం వద్ద పలువురు వైకాపా నేతలు నివాళులు అర్పించారు. వైఎస్ సతీమణి విజయమ్మ, జగన్ సతీమణి భారతి, సోదరి షర్మిల తదితరులతో పాటు పలువురు నేతలు నివాళులు అర్పించారు.