MAA: 'మా' నిధుల దుర్వినియోగం... కార్యాలయానికి తాళం వేసిన నరేష్, అత్యవసర సమావేశం!

  • మాలో భగ్గుమన్న వివాదం
  • శివాజీ రాజాపై నిధుల స్వాహా ఆరోపణలు
  • వివరణ ఇచ్చిన తరువాత ఏకాభిప్రాయం కుదిరిందన్న నరేష్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో మరోసారి వివాదం భగ్గుమంది. నిధులు స్వాహా అయ్యాయన్న ఆరోపణలతో అధ్యక్షుడు శివాజీ రాజా, కార్యదర్శి నరేష్ మధ్య గొడవ జరిగింది. సంఘం కార్యాలయానికి నరేష్ తాళం వేయడంతో, వెంటనే స్పందించిన పెద్దలు అత్యవసర సమావేశం నిర్వహించాల్సి వచ్చింది.

శివాజీ రాజా 'మా' అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తరువాత, భారీ ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలపై ఈ సమావేశం దాదాపు నాలుగు గంటల పాటు చర్చించింది. అధ్యక్షుడిగా ఉన్న శివాజీరాజా వివరణ ఇవ్వడంతో సంతృప్తి చెందిన నరేష్, ఓ ప్రకటన విడుదల చేశారు. అసోసియేషన్ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని ఆయన అన్నారు. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని శివాజీ రాజా ఇచ్చిన వివరణతో తృప్తి చెందామని, ఇకపై కలసి పనిచేస్తామని ఆయన చెప్పారు.
MAA
Tollywood
Sivaji Raja
Naresh

More Telugu News