బిగ్ బాస్... ఇద్దరు ఎలిమినేషన్... ఒకరు గణేశ్, ఇంకొకరిపై సస్పెన్స్!

- బయటకు వెళ్లే వారి వివరాలు రహస్యం
- నామినేషన్స్ లో ఐదుగురు
- ప్రొటెక్టెడ్ జోన్ లోకి వెళ్లిపోయిన కౌశల్
కౌశల్ ప్రొటెక్టెడ్ జోన్ లోకి వెళ్లిపోయాడని చెప్పిన నాని, ఇద్దరిని ఎలిమినేట్ చేయనున్నట్టు చెబుతూ, తొలి పేరుగా గణేష్ ను ప్రకటించాడు. తొలుత ఈ విషయాన్ని ఇంటి సభ్యులెవరూ నమ్మలేదు. నాని మరోసారి చెప్పేసరికి గణేష్, తన వస్తువులను సర్దుకుని బయటకు వచ్చేశాడు. ఇక నేడు మరొకరు ఎలిమినేట్ కానుండగా, ఎవరు బయటకు వస్తారన్న విషయమై సస్పెన్స్ నెలకొని వుంది.