Petrol: ఆల్ టైమ్ రికార్డు స్థాయికి పెట్రోలు ధర!

  • సామాన్యుల నడ్డి విరుస్తున్న ధరలు
  • ముంబైలో రూ. 86.09కి లీటరు పెట్రోలు ధర
  • ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు
పెట్రోలు, డీజిల్ ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. రోజువారీ సవరణల విధానాన్ని ప్రవేశపెట్టిన తరువాత, తెలియకుండానే ధరలు పెరుగుతూ, పెరుగుతూ ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. తాజాగా, లీటరు పెట్రోలు ధర 16 పైసలు పెరుగగా, ముంబైలో రూ. 86.09కి ధర చేరుకుంది. ఇండియాలో లీటరు పెట్రోలు ధర ఈ స్థాయికి పెరగడం ఇదే తొలిసారి. ఇక కోల్ కతాలో రూ. 81.60, న్యూఢిల్లీలో రూ. 78.68గా ఉంది.

 ఇదే సమయంలో డీజిల్ ధర లీటరుకు 21 పైసలు పెరిగి కోల్ కతాలో రూ. 73.27, ముంబైలో రూ. 74.76, చెన్నైలో రూ. 74.39గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతూ ఉండటం, దానికితోడు చమురు రవాణాపై ఎక్సైజ్ సుంకాల భారం కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో ఏడాదిలోగా, పెట్రోలు ధర వంద రూపాయలను దాటుతుందని భావిస్తున్నారు.
Petrol
Diesel
Crude Oil
Market
All Time High

More Telugu News