Telangana: ఈ ఏడాదిలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది: మంత్రి తుమ్మల

  • ఎన్నికలు ముందుగానే జరిగే అవకాశాలు ఉన్నాయి
  • రేపు కేబినెట్ సమావేశం జరగనుంది
  • ఈ భేటీలో ప్రగతి నివేదన సభపై చర్చిస్తాం
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు దానికి మరింత బలం చేకూర్చాయి. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు ముందుగానే జరిగే అవకాశాలు ఉన్నాయని, తనకు తెలిసి ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు.

 ఈ సందర్భంగా రేపు జరగబోయే కేబినెట్ సమావేశం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. రేపు జరగబోయే ప్రగతి నివేదన సభలో ఏమి నివేదించబోతున్నాము? ఏ విషయాలు చర్చించాలి? అనే దాని గురించే కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కాగా, తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ, ఉద్యోగస్తులకు వరాల జల్లు కురిపించడం, టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ .. వంటి అంశాలన్నీ తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావిడికి సంకేతాలని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Telangana
minister
tummala

More Telugu News