cm kcr: తినబోయే ముందు రుచులెందుకు అడగడం?: మంత్రి కేటీఆర్

  • రేపటి కేబినెట్ భేటీలో ఏం జరుగుతుందో వేచి చూడాలి
  • టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చెప్పేందుకే ఈ సభ
  • ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నాం
రేపటి కేబినెట్ సమావేశంలో ఏం జరుగుతుందో వేచి చూడాలని, తినబోయే ముందు రుచులెందుకు అడగటమని మంత్రి కేటీఆర్ అన్నారు. రేపు కొంగరకలాన్ లో నిర్వహించే ప్రగతి నివేదన సభా ప్రాంగణాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచడానికే ఈ సభ నిర్వహిస్తున్నామని, అభివృద్ధిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పన్నిన కుట్రలను ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు.

 ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని చెప్పిన కేటీఆర్, ఎన్నికల ప్రచారం కోసం మాత్రం ఈ సభను  నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. సభకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నామని, రుసుంలు చెల్లించామని, ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కాగా, సభా ప్రాంగణం వద్ద నాలుగేళ్ల పాలనపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను కేటీఆర్ ప్రారంభించారు.
cm kcr
electricity emp;oyees

More Telugu News