West Bengal: పార్టీ ఫిరాయించిన తల్లి.. కసితో ఆమె కుమారుడిని కాల్చిన బీజేపీ నేత!

  • పశ్చిమబెంగాల్ లో ఘటన
  • పార్టీ ఫిరాయించిన మహిళా నేత
  • తల్లి కోసం వచ్చి పిల్లాడిపై కాల్పులు

హింసా రాజకీయాలకు నెలవుగా మారిన పశ్చిమ బెంగాల్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ఎన్నికల సందర్భంగా పార్టీ ఫిరాయించి తమను ఇబ్బంది పెట్టిన మహిళపై కోపంతో బీజేపీ నేత ఒకరు ఆమె మూడేళ్ల కుమారుడి తలపై తుపాకీతో కాల్చాడు.

ఇటీవల పశ్చిమబెంగాల్ లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో మాణిక్ చాక్ డివిజన్ లోని 18 పంచాయతీల్లో బీజేపీ పదింటిని, అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరింటిని గెలుపొందాయి. సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు చెరొకటి దక్కించుకున్నప్పటికీ అవి తృణమూల్ కే మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తరఫున గెలిచిన పుతల్ మండల్ అనే మహిళ తృణమూల్ కాంగ్రెస్ లో చేరిపోయారు.

దీంతో డివిజన్ లో ఇరువురి బలాబలాలు సమానమయ్యాయి. చివరికి టాస్ వేయగా, బీజేపీని విజయం వరించింది. అయితే, ఎన్నికల్లో తమ పార్టీ తరఫున గెలిచిన మండల్ తృణమూల్ వైపు వెళ్లడాన్ని జీర్ణించుకోలేని బీజేపీ నేత అనిల్ రగిలిపోయాడు. తుపాకీ తీసుకుని హతమార్చేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ మండల్ కనిపించకపోవడంతో ఆమె కుమారుడి(3) తలపై తుపాకీతో కాల్చాడు. అయితే ఈ దాడిని తాము చేయలేదనీ, తమకు సంబంధం లేదని బీజేపీ నేతలు వాదిస్తున్నారు.

More Telugu News