శివుడికి మొక్కు తీర్చుకునేందుకు మానస సరోవర యాత్రకు రాహుల్ గాంధీ!

- ఏప్రిల్‌లో రాహుల్ విమానానికి ప్రమాదం
- ప్రమాదం నుంచి బయటపడితే మొక్కు తీర్చుకుంటానన్న రాహుల్
- రాహుల్ యాత్రపైనా బీజేపీ విమర్శలు
ఈ ఏడాది ఏప్రిల్‌లో కర్ణాటక పర్యటన సందర్భంగా రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. హుబ్బళ్లి వద్ద తృటిలో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడితే తాను మానస సరోవరంలో శివుడిని దర్శించుకుంటానని మొక్కుకున్నారు. ఈ మేరకు మొక్కు తీర్చుకునేందుకు శుక్రవారం రాహుల్ యాత్రకు బయలుదేరారు.