bandaru dattatreya: ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా.. దేనికైనా సిద్ధం: బండారు దత్తాత్రేయ

  • పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేస్తా
  • తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్నాయి
  • పార్టీని సమాయత్తం చేయాలని అమిత్ షా సూచించారు
రానున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకైనా, ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకైనా తాను సిద్ధమేనని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ చెప్పారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు తాను పోటీ చేస్తానని అన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్నాయని, అందుకు పార్టీని సమాయత్తం చేయాలని తమ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక గురించి రెండు నెలలుగా కసరత్తు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో జోనల్ వ్యవస్థను తాము వ్యతిరేకించలేదని, అందరికీ ఉద్యోగాలు రావాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. 
bandaru dattatreya
amith shah
elections

More Telugu News