Kerala: మానవత్వం పరిమళించింది... కేరళకు రూ. 1000 కోట్లు దాటిన ప్రజల సాయం!

  • కేరళకు విరాళాల వెల్లువ
  • సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 1,027 కోట్లు
  • ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు
జల ప్రళయంతో కకావికలమైన కేరళను ఆదుకునేందుకు యావత్ భారతావని ముందుకొచ్చింది. చిన్నారుల నుంచి బడా వ్యాపారులు, రాజకీయ నాయకుల వరకూ తమకు చేతనైనంత సాయం చేయడంతో కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి చేరిన విరాళాల విలువ రూ. 1000 కోట్లను దాటింది. గురువారం వరకూ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 1,027 కోట్లు వచ్చి చేరాయని, 4.76 లక్షల మంది ఆన్ లైన్ మాధ్యమంగా విరాళాలు ఇచ్చారని చెబుతూ, కేరళ సర్కారు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పింది.

ఎలక్ట్రానిక్ చెల్లింపుల ద్వారా రూ. 145.17 కోట్లు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ మాధ్యమంగా మరో 46.04 కోట్లు వచ్చాయని, డైరెక్ట్ డిపాజిట్లు, చెక్కుల రూపంలో 835.86 కోట్లు వచ్చాయని ప్రభుత్వం వెల్లడించింది. కాగా, గత శతాబ్దకాలంలో ఎన్నడూ రానంత వరద ఒక్కసారిగా విరుచుకుపడగా, తిరువనంతపురం మినహా మిగతా అన్ని జిల్లాలూ నీట మునిగాయి. అధికారిక లెక్కల ప్రకారం, 483 మంది మరణించగా, వేల కోట్ల రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
Kerala
Floods
Rain
Help
CM Relief Fund

More Telugu News